Page Loader
USCIS: జూలై వీసా బులెటిన్ విడుదల.. గ్రీన్ కార్డు ఆశావాహులకు తాత్కాలిక ఊరట!
జూలై వీసా బులెటిన్ విడుదల.. గ్రీన్ కార్డు ఆశావాహులకు తాత్కాలిక ఊరట!

USCIS: జూలై వీసా బులెటిన్ విడుదల.. గ్రీన్ కార్డు ఆశావాహులకు తాత్కాలిక ఊరట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా జూలై 2025 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా ఈబీ-1, ఈబీ-2 వర్గాల్లో ఎలాంటి తేదీ మార్పులు లేని సందర్భంలో, ఈబీ-3 కేటగిరీలో కొద్దిగా పురోగతి కనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వర్గాల్లో కొన్ని కేటగిరీల్లో గణనీయమైన తేదీ మార్పులు చోటు చేసుకున్నాయి.

Details

ముఖ్యమైన తేదీలు, మార్పులు

ఫ్యామిలీ స్పాన్సర్డ్ కేటగిరీలు F1 (అమెరికా పౌరుల అవివాహిత కుమారులు/కుమార్తెలు) మునుపటి తేదీ జూన్ 8, 2016 నుంచి జూలై 15, 2016కి మారింది. ఇది 1 నెల 1 వారం ముందుకు వచ్చింది. F2A (శాశ్వత నివాసితుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు పిల్లలు) జనవరి 1, 2022 నుంచి సెప్టెంబర్ 1, 2022 వరకు గణనీయంగా ముందుకు వచ్చింది. F2B (శాశ్వత నివాసితుల 21 ఏళ్ల పైబడిన అవివాహిత కుమారులు/కుమార్తెలు) సెప్టెంబర్ 22, 2016 నుంచీ అక్టోబర్ 15, 2016కి మారింది. F3 (అమెరికా పౌరుల వివాహిత కుమారులు/కుమార్తెలు) జూన్ 22, 2011 నుంచి ఆగస్టు 1, 2011కి మారింది.

Details

F4 (అమెరికా పౌరుల వయోజన సోదరులు/సోదరీమణులు)

జూన్ 15, 2006 నుంచి జూలై 8, 2006కి మారింది. ఉపాధి ఆధారిత కేటగిరీలు EB-1, EB-2 ఈ కేటగిరీల్లో తేదీల్లో ఎలాంటి మార్పు లేదు EB-3 (స్కిల్డ్ వర్కర్స్) ఏప్రిల్ 15, 2013 నుంచి ఏప్రిల్ 22, 2013 వరకు ఒక్క వారం ముందుకు వచ్చింది దాఖలుకు తేదీలు (Dates for Filing) ఫ్యామిలీ స్పాన్సర్డ్ F2A ఫిబ్రవరి 1, 2025 నుంచి మార్చి 1, 2025కి మారింది. F4 అక్టోబర్ 1, 2006 నుంచీ డిసెంబర్ 1, 2006కి ముందుకు వచ్చింది. ఈ మార్పులతో, కొంతకాలంగా ఎదురుచూస్తున్న భారతీయ వీసా దారులకు కొన్ని కేటగిరీలలో లాభం జరిగే అవకాశం ఉంది.