Dubai: పర్యాటక వీసాపై వెళ్లి.. దుబాయ్‌లో కేరళ యువకుడి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లిన కేరళకు చెందిన మహమ్మద్ మిషాల్ (19) అనే యువకుడు దురదృష్టవశాత్తూ భవనం పై నుంచి పడిపడి మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కోజికోడ్ జిల్లాగా గుర్తించారు. అసలేం జరిగిందంటే.. మిషాల్ స్నేహితుడు హనీఫా తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 15 రోజుల క్రితం మిషాల్ తన బంధువులను కలుసుకోవడానికి పర్యాటక వీసాతో దుబాయ్‌కు వెళ్లాడు. ఫోటోగ్రఫీ అంటే అతనికి విపరీతమైన ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో ఎయిర్‌పోర్ట్ సమీపంలోని బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కి, అక్కడి విమానాల ఫోటోలు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు.
వివరాలు
మిషాల్ సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చదువుతున్నాడు
స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మిషాల్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మిషాల్ తండ్రి కోజికోడ్‌లో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని, మిషాల్ స్థానిక కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చదువుతున్నాడని హనీఫా తెలిపారు. చురుకైన స్వభావం కలిగిన మిషాల్ మృతి తమకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆయన అన్నారు. చట్టపరమైన చర్యలు పూర్తి అయిన వెంటనే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబం నిర్ణయించినట్లు సమాచారం.