USA: 'మేం సానుకూలంగా వ్యవహరించాం కాబట్టే విరామం ఇచ్చాం' : ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, ఆ దేశంపై తీవ్రస్థాయిలో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మౌంట్ రష్‌మోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ''వెనెజువెలాపై అత్యంత వేగంగా విజయం సాధించాం. ఇరాన్‌పై కూడా వారు తీవ్రంగా దెబ్బతినేలా దాడులు చేపట్టాం. ప్రస్తుతం ఇరాన్ మనతో రాజీ కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని వారు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించిన మేము, ఖమేనీ అంతిమక్రియల కోసం ఇరాన్‌కు వారం రోజుల యుద్ధ విరామాన్ని కల్పించాం'' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తం..
ఇదిలా ఉండగా, ఖమేనీ పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు శనివారం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా సముదాయానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మరోవైపు, లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉన్న అంతిమయాత్ర సందర్భంగా విదేశీ దాడి జరిగే ప్రమాదం ఉందని ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం సుప్రీం లీడర్‌గా ఉన్న మొజ్తబా ఖమేనీని అంత్యక్రియల సమయంలో లక్ష్యంగా చేసుకునే ప్రణాళిక సిద్ధం చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, దాడి జరిగే అవకాశంపై ఆందోళన వ్యక్తమవుతోంది.