Kuwait Building Fire: కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది కార్మికులు సజీవదహనం.. కువైట్ బయలుదేరిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి
దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో విదేశీ కార్మికులు నివసించే బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన 11 మందితో సహా 40 మంది భారతీయులు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. కాగా, బుధవారం ఉదయం నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తర్వాత తాను గురువారం కువైట్‌లో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. కువైట్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రధానితో సహా మేమంతా చాలా ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు. మృతదేహాలను గుర్తించిన వెంటనే భారత్‌కు తీసుకువస్తామని తెలిపారు.
కువైట్ వలస కార్మికులకు ప్రధాన గమ్యస్థానం
విదేశాంగ శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, "నిన్న రాత్రి మాకు వచ్చిన గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య 48-49గా ఉంది, అందులో 42 లేదా 43 మంది భారతీయులు ఉన్నారు." ఇతర పెర్షియన్ గల్ఫ్ దేశాల మాదిరిగానే కువైట్ కూడా వలస కార్మికులకు ప్రధాన గమ్యస్థానం. స్థానిక జనాభా కంటే వలస కూలీలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 42 లక్షల జనాభా ఉన్న ఈ దేశం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం కంటే కొంచెం చిన్నది. అయితే, ఇది ప్రపంచంలో ఆరవ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది.
మృతదేహాలను గుర్తించడానికి DNA పరీక్ష
ఢిల్లీ విమానాశ్రయం నుంచి కువైట్‌కు బయలుదేరే ముందు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌సింగ్ మాట్లాడుతూ.. "ఈ అంశంపై నిన్న సాయంత్రం ప్రధానితో సమావేశం నిర్వహించామని.. అక్కడికి చేరుకోగానే పరిస్థితి తేలనుంది.. ప్రస్తుతం బాధితులు ఎక్కువగా ఉన్నారు, మృతదేహాలను గుర్తించడానికి DNA పరీక్ష జరుగుతోంది, మృతదేహాలను తిరిగి తీసుకువస్తాము"అని అన్నారు.