Iran: కువైట్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..!
ఈ వార్తాకథనం ఏంటి
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన దాడులను మరింతగా తీవ్రతరం చేసింది. తాజాగా కువైట్'కు చెందిన ఓ భారీ చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరగడం కలకలం రేపుతోంది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం, 'అల్ సల్మీ' అనే ముడి చమురు ట్యాంకర్ దుబాయ్ పోర్టు సమీపంలో నిలిచివున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్‌కు చెందిన డ్రోన్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడంతో నౌకలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి.
వివరాలు
24 మంది సిబ్బంది సురక్షితం
మంటలు వేగంగా వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని అగ్ని నియంత్రణ చర్యలు చేపట్టాయి. తీవ్ర స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించినప్పటికీ, నౌకలో ఉన్న 24 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు స్పష్టం చేశారు. ఎవరికీ గాయాలు కాలేదని కూడా ధ్రువీకరించారు. అయితే, ఈ సంఘటనలో అత్యంత ఆందోళనకర అంశం ట్యాంకర్ పూర్తిగా ముడి చమురుతో నిండివుండటమే.
వివరాలు
పర్యావరణానికి భారీ నష్టం
ఈ కారణంగా సముద్రంలో చమురు ఒలికే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలా జరిగితే పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ ఘటనను దుబాయ్ అధికారులు కూడా ధృవీకరించారు. రెస్క్యూ సిబ్బంది సమర్థంగా పనిచేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.