Lalit Modi: వనౌట్ పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ.. ఆ దేశ ప్రత్యేకతలు ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు అందరి దృష్టి పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశం 'వనౌటు' (Vanuatu)పై కేంద్రీకృతమైంది.
సుమారు 80 ద్వీపాల సమూహంగా ఉన్న ఈ దేశ ప్రత్యేకతలను పరిశీలిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) ఆ దేశ పౌరసత్వం పొందడమే కారణమని చెప్పొచ్చు.
ఐపీఎల్ బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఆయన లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంలో తన పాస్‌పోర్టును అప్పగిస్తానని దరఖాస్తు చేసుకున్నాడు.
అంతకు ముందు వనౌటు 'గోల్డెన్ పాస్‌పోర్ట్' కార్యక్రమం కింద ఆ దేశ పౌరసత్వం పొందాడు.
స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకు లలిత్ మోదీ ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Details
వనౌటు పౌరసత్వం ప్రత్యేకతలు
ఆస్ట్రియన్ ఇమిగ్రేషన్ ఇన్వెస్ట్ అధిపతి 'జ్లాటా ఎర్లాచ్' కొన్ని వివరాలు వెల్లడించారు.
ఆదాయ పన్ను మినహాయింపు
స్థానికంగా, అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా ఏ దానిపైనా ఆదాయపన్ను ఉండదు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను ఉండదు
దీర్ఘకాలిక లాభాలపై పన్ను ఉండదు
స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి లాభదాయకం.
వారసత్వ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లు లేవు
వ్యాపార సంస్థ రిజిస్టర్ చేసుకున్నా, విదేశీ ఆదాయాన్ని పొందినా ఎలాంటి ఇబ్బంది లేదు.
క్రిప్టో హబ్‌గా అభివృద్ధి
వనౌటు 'క్రిప్టోకరెన్సీ వ్యాపారాలు' చేసేవారికి మద్దతుగా ఉండే విధంగా అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా వనౌటు 2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో తొలి స్థానంలో నిలిచింది.