Lashkar-e-Taiba: ఢిల్లీ,ఆగ్రా పై దాడులు చేస్తాం,భారత్‌ను ముక్కలు చేస్తాం.. లష్కరే ఉగ్రవాది హెచ్చరిక..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఉగ్రవాదులపై పలు దాడులు జరిగాయి. లష్కరే తోయిబా (LeT) మురిడ్కే హెడ్‌క్వార్టర్ మరియు జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు బహవల్పూర్‌లో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ, ఈ ఉగ్రవాదులు తమ భారత్ వ్యతిరేక దృక్కోణాన్ని విడిచిపెట్టడం లేదు. టైమ్ కుదిరితే భారత్‌పై విధ్వంసానికి సిద్ధమని వార్నింగ్ కూడా ఇచ్చారు. వారు అఖండ భారతాన్ని ముక్కలుగా చేయడం, ఢిల్లీని వణికించడం, ఆగ్రాను అగ్నికి ఆహుతి చేయడం, దక్కన్ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం, కాశ్మీర్‌ను విముక్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలికాడు.
వివరాలు
భారత్‌పై విషం కక్కిన పాక్ ఉగ్రవాదులు
తాజాగా, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ సయీద్ అబ్దుల్ రెహ్మాన్ నక్వీ, లాహోర్‌లోని పబ్లిక్ సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీ, ఆగ్రా వంటి ప్రధాన నగరాలపై దాడులు చేయబోతున్నట్లు హెచ్చరించారు. "కాశ్మీర్ సాలిడారిటీ డే" సందర్భంగా పాక్ ఉగ్రవాదులు అనేక కార్యక్రమాలు నిర్వహించి భారత్‌పై విషం కక్కారు. భారతదేశాన్ని ముక్కలుగా చేస్తామని, కాశ్మీర్‌కు విముక్తి చేస్తామని అన్నారు. లష్కరే తోయిబా రాజకీయ పార్టీగా ఉన్న పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నక్వీ, తన పార్టీని ఉగ్రవాదంతో అనుసంధానించాడు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఆయన కుమారుడు తల్హా సయీద్‌లకు నక్వీ అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హెచ్చరిస్తున్న లష్కరే ఉగ్రవాది
🚨 OPEN THREATS | EXPOSED
— Aadi The Manifested One (@AadiVagabond) February 5, 2026
“Akhand Bharat ko khand-khand kar denge…”
“Agra ko aag laga denge…”
“Dilli ko dehla denge…”
PMML / Lashkar-e-Taiba leader Syed Abdul Rehman Naqvi, close aide of Talha Saeed, openly issues recorded threats against India. No ambiguity. No denial.… pic.twitter.com/PM6bejz4Yg