Loading...
West Asia: పశ్చిమాసియాను వెంటనే వీడండి.. అమెరికన్లకు అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాను వెంటనే వీడండి.. అమెరికన్లకు అత్యవసర హెచ్చరిక

West Asia: పశ్చిమాసియాను వెంటనే వీడండి.. అమెరికన్లకు అత్యవసర హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), జోర్డాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికన్లు వీలైనంత త్వరగా పశ్చిమాసియాను విడిచి వెళ్లాలని, లేకపోతే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని సూచించాయి. ఇరాన్‌ దాడులు మరింత ఉద్ధృతమైతే ప్రాంతీయ విమానయాన సేవలకు అంతరాయం కలగవచ్చని, అవసరమైతే పలు విమాన మార్గాలను మూసివేసే అవకాశం ఉందని రాయబార కార్యాలయాలు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్‌లో గెలవాలని మేం కోరుకుంటున్నాం.

వివరాలు

అమెరికా నీటి సరఫరా వ్యవస్థపై ఇరాన్‌ సైబర్‌ దాడి?

ఇక ఏమాత్రం భరించలేని స్థితికి చేరే వరకు ఆ దేశంపై దాడులు కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో నీటి సరఫరా వ్యవస్థలపై ఇరాన్‌ సైబర్‌ దాడులకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని 'న్యూయార్క్‌ టైమ్స్‌' శనివారం వెల్లడించింది.

ఫెడరల్‌ అధికారులు, సైబర్‌ భద్రతా నిపుణులు కూడా ఈ అనుమానాలను ధ్రువీకరించినట్లు పత్రిక పేర్కొంది.

అయితే ఈ దాడుల కారణంగా నీటి సరఫరాకు మాత్రమే అంతరాయం ఏర్పడిందని, నీటి నాణ్యత లేదా కలుషితంపై ఎలాంటి ప్రభావం లేదని** అధికారులు స్పష్టం చేశారు.

ADVERTISEMENT