Taslima Nasreen: షేక్ హసీనా తిరిగి రావాలంటే.. అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేయండి: తస్లీమా నస్రీన్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా (Sheikh Hasina) ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ (Taslima Nasrin) బహిరంగ మద్దతు ప్రకటించారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలంటే, ముందుగా ఆమె పార్టీ అవామీ లీగ్‌పై విధించిన నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం ఎత్తివేయాలని తస్లీమా డిమాండ్ చేశారు. 19 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు తిరిగి వచ్చిన తస్లీమా నస్రీన్, ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
వివరాలు
హసీనాను బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధం
ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ.. "షేక్ హసీనాను దేశం నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయం కాదు.
ఆమెను అధికారంలో నుంచి తొలగించిన విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
అలాగే అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం కూడా అప్రజాస్వామికమే. ప్రభుత్వం ఆ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి.
హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం ఆమె పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని వ్యాఖ్యానించారు.
వివరాలు
భారత్‌లో రెండేళ్లుగా ఆశ్రయం
2024 జూలైలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది.
ఆందోళనకారుల తిరుగుబాటుతో ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి రెండేళ్లుగా ఆమె భారత్‌లోనే ఉంటున్నారు.
ఇటీవల షేక్ హసీనా ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించారు.
అయితే ఆమె దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.
వివరాలు
మరణశిక్షపై వివాదం
షేక్ హసీనాను భారత్ అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా కోరుతోంది. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.
2024లో జరిగిన ఘర్షణల సమయంలో తీవ్ర అణచివేతకు పాల్పడి పలువురి మరణాలకు కారణమయ్యారనే ఆరోపణలతో ఈ తీర్పు వెలువడింది.
అదే కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది.
అయితే ఈ తీర్పు ఏకపక్షంగా ఉందని, పూర్తిగా అన్యాయమని షేక్ హసీనా తీవ్రంగా విమర్శించారు.