Florida: ట్రంప్ నివాసానికి సమీపంలో క్షిపణిలా దూసుకొచ్చిన బిజినెస్ జెట్.. తొమ్మిది మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బిజినెస్ జెట్ వేగంగా ఎత్తు కోల్పోయి రోడ్డుపై కూలిపోయింది. క్షణాల్లోనే భారీ అగ్నిగోళంగా మారింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన ధాటికి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నుంచి బహమాస్‌కు బయలుదేరిన ఈ విమానం.. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో ప్రమాదానికి గురైంది. ట్రంప్‌కు చెందిన 'మార్-ఎ-లాగో' రిసార్ట్‌కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
వివరాలు
'మాకు సమయం లేదు'
అయితే, విమానం నివాస ప్రాంతాలకు, వాహనాలకు దూరంగా కూలిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది.
ప్రమాదానికి ముందు విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు.
విమానం అదుపు తప్పి వేగంగా ఎత్తును కోల్పోతుండటంతో వారు ఆందోళనకు గురైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
'మాకు సమయం లేదు' అంటూ విమానంలోని సిబ్బంది ఆర్తనాదాలు చేస్తున్న ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.
ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానం స్వల్పంగా కుదుపులకు గురైందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలిపారు.
అయితే, ఆ కుదుపులు నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.
వివరాలు
సిబ్బంది అత్యవసర హెచ్చరిక జారీ
విమానం వేగంగా కిందకు దూసుకెళ్తుండటంతో సిబ్బంది అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. 'మేడే.. మేడే.. మేము వేగంగా ఎత్తును కోల్పోతున్నాం.
విమానం ఓవర్ స్పీడ్‌లో ఉంది' అంటూ అధికారులను అప్రమత్తం చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
విమానం రోడ్డుపై కూలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేపట్టాయి.
విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుప్పకూలిన విమానం దృశ్యాలు
That’s unfortunate.
— William Munny (@Willy_Munny) November 2, 2026
Business jet crashes in Green Acres Florida. Oooof. pic.twitter.com/wICs34MuPn