NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / London: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత
    తదుపరి వార్తా కథనం
    London: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత
    సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత

    London: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లండన్‌లోని హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

    ఈ ఘటన నేపథ్యంలో మార్చి 22 వరకు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    ఎయిర్‌పోర్టులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

    దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో విమానాశ్రయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

    ప్రయాణికులు 24 గంటల పాటు విమానాశ్రయానికి రాకూడదని, మరిన్ని వివరాల కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

    అయితే విమానాశ్రయ కార్యకలాపాలు ఎప్పుడుపునరుద్ధరించబడతాయనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

    వివరాలు 

    మంటలను ఆర్పడానికి 10 అగ్నిమాపక యంత్రాలు

    విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సమీపంలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది.

    చుట్టుపక్కల నివాసాల్లో చీకట్లు అలముకోవడంతో 150 మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    మంటలను అదుపులోకి తెచ్చేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది కృషి చేస్తున్నారు.

    ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టులో మంటల దృశ్యాలు 

    🚨 BREAKING: Heathrow Airport says it will be closed all day due to significant power outage caused by a fire at a nearby electrical substation

    “We expect significant disruption over the coming days and passengers should not travel to the airport under any circumstances” pic.twitter.com/jeqEqb8BX6

    — Politics UK (@PolitlcsUK) March 21, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లండన్

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    లండన్

    టేకాఫ్‌ అవుతున్న విమానంలో అరుపులు, కేకలు.. డోర్ తీయబోయిన యువకుడు అరెస్ట్  అంతర్జాతీయం
    లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి  రోడ్డు ప్రమాదం
    ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు ఇంగ్లండ్
    హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు  జమిలి ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025