LOADING...
Yacht Sink: $1 మిలియన్ విలువైన  నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక.. వీడియో
$1 మిలియన్ విలువైన  నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక.. వీడియో

Yacht Sink: $1 మిలియన్ విలువైన  నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక.. వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఉత్తర తుర్కీ లోని జోంగుల్డాక్‌ తీరంలో ఒక లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాస్తవానికి, ఈ నౌకను మెడ్‌ యిల్మాజ్‌ షిప్‌యార్డ్‌లో తయారు చేశారు.దీని నిర్మాణానికి సుమారు 1 మిలియన్‌ డాలర్లు,అంటే భారత రూపాయల్లో 8.74 కోట్ల వరకు ఖర్చయింది. మంగళవారం కొద్దిమంది ప్రయాణికులు,సిబ్బంది కలిసి నౌక ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, ప్రయాణం ప్రారంభమైన 15 నిమిషాలకే నౌక సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది తక్షణమే సముద్రంలో దూకి, సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

వివరాలు 

నౌక మునిగిపోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు 

నౌక మునిగిపోవడాన్ని చూసిన యజమాని,కెప్టెన్‌ తీవ్ర నిరుత్సాహంతో ఉండిపోయారు, ఈనేపథ్యంలో చేసేదేమి లేక వారు కూడా సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు. నిర్వాహకుల ప్రకటన ప్రకారం,ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. నౌక మునిగిన కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడించబడలేదు. అధికారులు త్వరలో దీని పై పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. అంతేకాక, ఈ నౌక మునిగిపోవడం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న మునిగిన  నౌక వీడియో