NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Emmanuel Macron:  పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌.. 
    తదుపరి వార్తా కథనం
    Emmanuel Macron:  పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌.. 
    పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్‌.. స్నాప్‌ ఎలక్షన్స్‌కు పిలుపు

    Emmanuel Macron:  పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌.. 

    వ్రాసిన వారు Stalin
    Jun 10, 2024
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం హఠాత్తుగా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

    జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ నెలాఖరులో పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

    పార్లమెంట్‌ను రద్దు చేసిన అనంతరం మాక్రాన్ మాట్లాడుతూ దేశంలో తదుపరి ఎన్నికలు 30, జులై 7 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయని చెప్పారు.

    ఇటీవల జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో మాక్రాన్ ప్రత్యర్థి మెరైన్ లీ పెన్ పార్టీ జాతీయ ర్యాలీ భారీ విజయాన్ని నమోదు చేసింది.

    యూనియన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌తో నిరాశకు గురైన మాక్రాన్, యూరప్‌ను రక్షించాలనుకుంటున్న పార్టీలకు ఈ ఫలితాలు మంచివి కాదన్నారు.

    వివరాలు 

    మాక్రాన్ ఏమన్నారంటే ? 

    అంతకుముందు, జాతీయ ర్యాలీ నాయకుడు జోర్డాన్ బార్డెల్లా దేశంలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

    రాష్ట్ర టెలివిజన్‌లో మాక్రాన్ మాట్లాడుతూ, 'నేను మీ సందేశాన్ని విన్నాను, ప్రతిస్పందించకుండా నేను దానిని వదిలివేయలేను. శాంతి ,సామరస్యంతో పనిచేయడానికి ఫ్రాన్స్‌కు స్పష్టమైన మెజారిటీ అవసరం. ఏమీ పట్టనట్లు నేను ప్రవర్తించలేను, మీకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, అందుకే ఈ రాత్రే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నాను.

    వివరాలు 

    ఫ్రాన్స్ ప్రజలపై విశ్వాసం వ్యక్తం చేశారు 

    ఫ్రాన్స్ ప్రజలు రాబోయే తరాలకు మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మాక్రాన్ తన ప్రసంగంలో విశ్వాసం వ్యక్తం చేశారు.

    దీనితో పాటు, యూరోపియన్ యూనియన్ మరియు దేశంలో పెరుగుతున్న రైట్ వింగ్ పార్టీల ప్రభావంపై, ఐరోపాలో రైట్-వింగ్ పార్టీలు అన్ని చోట్లా పురోగమిస్తున్నాయని అన్నారు.

    అటువంటి పరిస్థితిలో, నేను నన్ను ఇన్వాల్వ్ చేయలేను కాబట్టి అసెంబ్లీని రద్దు చేసి మీకు ప్రత్యామ్నాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

    వివరాలు 

    మాక్రాన్ పార్టీ వెనుకబడి ఉంది 

    యూరోపియన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, 28 ఏళ్ల జోర్డాన్ బార్డెల్ నేతృత్వంలోని విలి నేషనల్ ర్యాలీ (RN) దాదాపు 32 శాతం ఓట్లను పొందింది.

    మాక్రాన్ రెనెసాస్ పార్టీకి సగం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, దాదాపు 14 శాతం ఓట్లు వచ్చాయి.

    యూరోపియన్ యూనియన్ అనేది ఐరోపాలోని 27 దేశాల రాజకీయ మరియు ఆర్థిక సంఘం.

    ఇది పార్లమెంటును కలిగి ఉంది, దీని ప్రతినిధులను నేరుగా యూరోపియన్ పౌరులు ఎన్నుకుంటారు. యూరోపియన్ చట్టం ప్రజాస్వామ్య చట్టబద్ధతను నిర్వహించడం దీని పని.

    ఈ యూనియన్ పౌరుల ప్రతినిధులతో రూపొందించబడింది, ఒకసారి ఎన్నుకోబడిన వారు ఐదు సంవత్సరాల పాటు తమను తాము ప్రాతినిధ్యం వహిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

    Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ ఫ్రాన్స్
    France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో  జైపూర్
    Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ శుభవార్త  అంతర్జాతీయం
    China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025