Page Loader
మడగాస్కర్‌ స్టేడియంలో పెను విషాదం.. తొక్కిసలాటలో 15 మంది మృతి, 80మందికి గాయాలు
తొక్కిసలాటలో 15 మంది మృతి, 80మందికి గాయాలు

మడగాస్కర్‌ స్టేడియంలో పెను విషాదం.. తొక్కిసలాటలో 15 మంది మృతి, 80మందికి గాయాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 26, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

మడగాస్కర్‌(ద్వీప దేశం)లోని జాతీయ స్టేడియంలో శుక్రవారం పెను విషాదం జరిగింది.తొక్కిసలాటలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. రాజధాని అంటనానరివోలోని స్టాంపెడే స్టేడియంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి క్రిస్టియన్ న్ట్సే వెల్లడించారు. 11వ ఇండియ‌న్ ఓషియ‌న్ పోటీల‌ను వీక్షించేందుకు 50 వేల మంది ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు.ఈ నేపథ్యంలోనే స్టేడియం ప్ర‌ధాన ద్వారం దగ్గర తొక్కిస‌లాట సంభవించింది. ఒక‌రికొక‌రు నెట్టుకోవడంతోనే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని మ‌డ‌గాస్క‌ర్ అధ్య‌క్షుడు ఆండ్రీ రాజోలినా చెప్పారు.గ‌త 40 ఏళ్లుగా నైరుతి హిందూ మ‌హాస‌ముద్ర దీవుల మ‌ధ్య పోటీల‌ను జరుపుతున్నారు. 4 ఏళ్లకోసారి నిర్వహించే ఈ పోటీల‌ను ఈసారి మ‌డ‌గాస్క‌ర్‌లో ఏర్పాటు చేశారు.కాగా సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు ఈ పోటీలు జరగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మడగాస్కర్‌ స్టేడియంలో తీవ్ర విషాదం