LOADING...
 Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు

 Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం, ఆగ్నేయ తీరంలోని టైటుంగ్ కౌంటీ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేల్ ప్రకారం భూకంపం తీవ్రత 6.1గా నమోదు అయింది. ఈ భూకంపం కారణంగా రాజధాని తైపీ నగరంలో కొన్ని భవనాలు కుప్పకూలిపోయినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Centre for Geosciences) తెలిపిన వివరాల ప్రకారం, భూకంపం భూమికి సుమారు 11.9 కిలోమీటర్ల లోతులో జరిగింది. స్థానిక మీడియా సంస్థ 'తైవాన్ న్యూస్' ప్రకారం, భూకంప కేంద్రం టైటుంగ్ కౌంటీ హాల్ నుంచి ఉత్తరం వైపుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తైవాన్‌లో భారీ భూకంపం

Advertisement