LOADING...
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌ తీరాన్ని మరోసారి భారీ భూకంపం వణికించింది. శుక్రవారం ఉదయం ఈశాన్య జపాన్‌లోని కుజీ పట్టణంలో భూమి ఒక్కసారిగా కంపించిందని సమాచారం. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.7గా నమోదైంది. తరువాత జపాన్‌ మెటలర్జికల్‌ ఏజెన్సీ (JMA) దీన్ని 6.5గా సవరిస్తూ ప్రకటించింది. ఈ భూకంపం కారణంగా సునామీ రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో పసిఫిక్‌ తీరం వెంబడి అలలు 3 అడుగుల ఎత్తు ఎగసి పడతాయని వెల్లడించింది.

వివరాలు 

సునామీ హెచ్చరికలు జారీ

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) ప్రకారం, భూమి 6.7 తీవ్రతతో కంపించింది. కుజీ పట్టణం, హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రాంతంలో, భూకంప కేంద్రానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత సోమవారం కూడా 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని గుర్తించాలి, ఆ సమయంలో సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తుకు ఎగసాయి. జపాన్‌ వాతావరణ సంస్థ హొక్కాయిడో, ఔమోరి, ఇవాటే ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవించే కారణం ఈ భూభాగం పసిఫిక్‌, ఫిలిప్పైన్‌, యూరాసియన్‌ మరియు నార్త్‌ అమెరికన్‌ ప్లేట్ల కలిసే ప్రాంతంలో ఉండటమే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జపాన్‌లో మరోసారి భూకంపం

Advertisement