Page Loader
Maria Sofia Valim: బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్ ఆకస్మిక మృతి 
బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్ ఆకస్మిక మృతి

Maria Sofia Valim: బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్ ఆకస్మిక మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2023
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్,ఔత్సాహిక న్యాయవాది మరియా సోఫియా వాలిమ్(19) అత్యవసర కాలేయ మార్పిడి తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సియారాలోని కౌసియా మునిసిపాలిటీకి మేయర్‌గా ఉన్న ఆమె తండ్రి విటర్ వాలిమ్ ఒక ప్రకటనలో ఆమె అకాల మరణాన్ని ధృవీకరించారు. రెండు రోజుల క్రితం,మరియా సోఫియా కి డోనార్ దొరకడంతో ఆపరేషన్ విజయవంతమైందని విటర్ వాలిమ్ తెలిపారు. ఆమె మరణానికి ముందు,సోఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వర్కౌట్‌ల పిక్స్ ను క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం,చర్మ సంరక్షణ సలహాలను అందించడం చేస్తుండేది. 1,00,000 మందికి పైగా ఆమెను ఫాలో అయ్యే వారు. ఆమె ఆకస్మిక మరణం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అత్యవసర కాలేయ మార్పిడి అనంతరం మృతి చెందిన  ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్