
Iran Explosion: బందర్ అబ్బాస్ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 280 మందికిపైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో వెంటనే మంటలు చెలరేగాయని స్థానిక మీడియా సమాచారం.
ఈ ప్రమాదంలో సుమారు 281 మంది గాయపడినట్లు నేషనల్ ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రతినిధి వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
అయితే పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నామని పేర్కొన్నారు.
Details
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
పేలుడు అనంతరం దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఘటనాస్థలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాల్లో అద్దాలు విరిగిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు.
అంతేకాకుండా పేలుడుతో ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. రజేయీ ఓడరేవు ప్రధానంగా కంటెయినర్ల కార్యకలాపాలకు ప్రసిద్ధి. ఏటా సుమారుగా 80 మిలియన్ టన్నుల సరకు ఇక్కడ ఎగుమతి, దిగుమతి అవుతుంది.
అదనంగా, ఈ ప్రాంతంలో చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.