Panama Canal bridge: పనామా సిటీలో భారీ పేలుడు.. బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో అగ్నిప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
పనామా సిటీలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ప్రసిద్ధమైన బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో ఈ బ్లాస్ట్ చోటుచేసుకుంది. పేలుడు ప్రభావంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటన సమయంలో బ్రిడ్జ్‌పై వాహనాలు సంచరిస్తుండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లా బోకా ప్రాంతంలోని బల్బో సమీపంలో ఈ పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ మార్గం రవాణా వ్యవస్థకు కీలకంగా ఉండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే పేలుడు నేరుగా బ్రిడ్జ్‌పై కాకుండా, దాని కింద భాగంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఒకరు మృతి
బ్రిడ్జ్ దిగువన సంభవించిన పేలుడు కారణంగా మంటలు పైభాగానికి వ్యాపించాయి. ఆ సమయంలో కొంతమంది వాహనదారులు అదే మార్గంలో ప్రయాణిస్తున్నట్లు వీడియోల్లో కనిపించింది. ఈ ఘటన సాయంత్రం సుమారు 4గంటల సమయంలో జరిగినట్లు పనామా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమించారు. ఈఘటనలో సెకండ్ డిగ్రీ కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. గాయపడిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మంటలను ఆర్పే క్రమంలో ఒకరు మృతిచెందగా,మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రభావం పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు బల్బో ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంటల్లో చిక్కుకున్న ప్రాంతం
WILD FOOTAGE 🔴
— Open Source Intel (@Osint613) April 6, 2026
A tanker blast near the Bridge of the Americas in Panama City ignited a major fire that spread to 2 additional storage units at the Balboa tank facility. Reports of 3 injuries, no foul play suspected (as of now) pic.twitter.com/GeAcicCVQe