తదుపరి వార్తా కథనం
Nightclub fire: నైట్ క్లబ్‌లో భారీగా మంటలు.. 50మందికి పైగా దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 16, 2025
02:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్‌లోని నార్త్ మెసిడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
నైట్ క్లబ్‌లో (Night Club) భీకరంగా అంటుకున్న మంటల్లో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రమాదం జరిగి గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదని సమాచారం. నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జేకు 100 కి.మీ దూరంలోని కొకాని పట్టణంలో ఉన్న పల్స్ క్లబ్‌లో శనివారం రాత్రి భారీ కాన్సర్ట్ జరిగింది.
ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరయ్యారు. అయితే ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ ఈవెంట్‌లో మండే స్వభావం (Pyrotechnic effects) కలిగిన వస్తువులు వాడటంతోనే సీలింగ్‌కు నిప్పు అంటుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.