
Pakistan: పాకిస్థాన్‌లో భారీ వరదలు.. 320 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విపత్తుకు దారితీశాయి. ఆకస్మిక వరదలతో రెండు రోజుల్లోనే 321 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. వీరిలో 307 మంది ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోనే మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఆ ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్, జబ్రారీ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం సంభవించింది. వరదల ధాటికి పాఠశాలలు, భవనాలు దెబ్బతిన్నాయి.
Details
గల్లంతైన వారి కోసం గాలింపు
పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు జలదిగ్బంధమై రవాణా అంతరాయం ఏర్పడింది. ఇక వరదల్లో గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు దాదాపు రెండు వేలమంది సిబ్బంది ముమ్మర ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, పాక్‌లోని మరిన్ని ప్రాంతాలకు కూడా భారీ వర్షాల ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కొత్త హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.