Papua New Guinea: పాపువా న్యూగినియా లో సునామీ: 2వేల మంది మృతి
పాపువా న్యూ గినియా ద్వీపకల్పంలో సునామీ కారణంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం తెల్లవారు ఘామున జరిగిన ఈ విలయతాండవం చోటు చేసుకుంది. ఈ ఘటనల్లో 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారు. ముంగా పర్వత భాగంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భవనాలు, ఆహార, పండ్ల తోటలకు విధ్వంసం పాలయ్యాయి. దీని ప్రభావం ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ పడింది. ఈ ఊహించని విపత్తు ఆదేశానికి శరాఘాతంలా మారింది. విలువైన పంటలు, పొలాలు సర్వ నాశనమయ్యాయి. ఈ మేరకు దేశపు విపత్తు విభాగం రాజధాని పోర్ట్ మోర్స్ బేలోని ఐక్యరాజ్య సమితి (ఐరాస)కార్యాలయానికి సమాచారం ఇచ్చింది.
బాహ్య ప్రపంచానికి ఆలస్యంగా వెలుగులోకి..
ఆ దేశంలోని పోర్గెరా మైన్ కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా స్ధంభించి పోయిందని తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారు ఘామున జరిగిన ఈ ఘటన బాహ్య ప్రపంచానికి సోమవారమే తెలిసింది. ఇప్పటికీ కొండ చరియలు విరిగి పడేలా వున్నాయని సహాయక బృందాలు తెలిపాయి. దీంతో పలు ఆటంకాలు ఎదురు అవుతున్నాయని ఐరాస సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రాణాలతో కొన ఊపిరితో ఉంటే వారికి తగిన సాయం చేయలేకపోతున్నామన్నారు.