Loading...
Donald Trump: వెనిజువెలాతో భారీ ఆయిల్‌ డీల్‌.. ట్రంప్‌ సంచలన ప్రకటన
వెనిజువెలాతో భారీ ఆయిల్‌ డీల్‌.. ట్రంప్‌ సంచలన ప్రకటన

Donald Trump: వెనిజువెలాతో భారీ ఆయిల్‌ డీల్‌.. ట్రంప్‌ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. వెనిజువెలాతో ఈ డీల్‌ కుదిరినట్లు తన 'ట్రూత్‌ సోషల్‌' ఖాతా ద్వారా ప్రకటించారు. అన్నీ అనుకూలంగా జరిగితే దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాలోని భారీ ఇంధన నిక్షేపాలను అమెరికా వినియోగించుకోనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సేత్‌, వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్‌ మధ్య జరిగిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు.

వివరాలు

17 ఆయిల్‌ ఫీల్డ్స్‌ అభివృద్ధి

ఈ ఒప్పందంలో భాగంగా 17 ఆయిల్‌ ఫీల్డ్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్‌ తెలిపారు.

వీటి నుంచి సుమారు 65 బిలియన్‌ బ్యారెళ్ల ఇంధనాన్ని వెలికితీసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.

వెనిజువెలా చమురు పరిశ్రమలోకి సుమారు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

ఈ ఒప్పందం ద్వారా పన్నుల రూపంలో సుమారు 209 బిలియన్‌ డాలర్లు వసూలయ్యే అవకాశాలు ఉన్నట్లు వెనిజువెలా ప్రభుత్వం వెల్లడించింది.

ADVERTISEMENT