LOADING...
Nirav Modi: పీఎన్‌బీ మోసం కేసులో నీరవ్‌ మోదీ బావకు మయాంక్ మెహతా క్షమాభిక్ష
పీఎన్‌బీ మోసం కేసులో నీరవ్‌ మోదీ బావకు మయాంక్ మెహతా క్షమాభిక్ష

Nirav Modi: పీఎన్‌బీ మోసం కేసులో నీరవ్‌ మోదీ బావకు మయాంక్ మెహతా క్షమాభిక్ష

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB)ను రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులలో ఒకరు మయాంక్ మెహతా కూడా ఉన్నారు. అయితే అతనికి క్షమాభిక్ష మంజూరైంది. బ్రిటన్ పౌరుడైన మయాంక్ దాదాపు 35 ఏళ్లుగా హాంకాంగ్‌లో నివసిస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మయాంక్, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఇప్పటికే క్షమాభిక్ష పొందిన విషయం పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణలో సహకరించేందుకు 2021లో స్వచ్ఛందంగా భారత్‌కు వచ్చామని, అన్ని కేసు విషయాలను బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన క్షమాభిక్ష కోసం కోర్టుకు అభ్యర్థించారు.

Details

భారత్ కు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు

ఈ క్రమంలో కోర్టు మయాంక్‌కు క్షమాభిక్ష ప్రసాదించింది. అతన్ని అప్రూవర్‌గా గుర్తిస్తూ, నేరానికి దారి తీసిన పరిస్థితులు, ఈ వ్యవహారంలో భాగమైన వ్యక్తుల వివరాలను బహిర్గతం చేయాలని షరతులు విధించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మయాంక్, వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి విచారణలో పాల్గొనాలని అధికారులను ఆదేశించింది. 2018లో PNBను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు వెలువడిన తర్వాత మెహుల్ ఛోక్సీ (Mehul Choksi), అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ 'ఆంటిగ్వా-బార్బుడా'కు వెళ్లగా, నీరవ్ మోదీ బ్రిటన్ జైలులో ఉన్నారు. భారత్ వీరిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది.