LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. ఒక్క రోజులో 12 మంది చిన్నారుల మృతి
ఒక్క రోజులో 12 మంది చిన్నారుల మృతి

Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. ఒక్క రోజులో 12 మంది చిన్నారుల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మీజిల్స్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది. గురువారం ఒక్క రోజులోనే 12 మంది చిన్నారులు మీజిల్స్ లేదా దానికి సంబంధించిన లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఆరుగురు ఢాకా డివిజన్‌కు చెందినవారు. మృతుల్లో ఒకరికి మీజిల్స్ నిర్ధారణ కాగా, మిగతా 11 మందిలో కూడా అదే తరహా లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఢాకా, బరిసాల్, ఖుల్నా, మైమెన్సింగ్, రాజ్‌షాహి, సిల్హెట్ ప్రాంతాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మరో 1,238 మంది చిన్నారుల్లో మీజిల్స్ లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు 

మీజిల్స్ టెస్టింగ్ కిట్ల కొరత.. ఆలస్యమవుతున్న పరీక్షలు

మార్చి 15 నుంచి ఇప్పటివరకు 57 మంది మీజిల్స్‌తో మృతి చెందగా, 279 మంది అనుమానిత కేసుల్లో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 45 వేల మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడగా, అందులో 31 వేల మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స అవసరమైంది. ఇదిలా ఉండగా, మీజిల్స్ టెస్టింగ్ కిట్ల కొరత కారణంగా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. వేలాది నమూనాలు పెండింగ్‌లో ఉండగా, రోజుకు పరిమిత సంఖ్యలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టీకాల సరఫరాలో అంతరాయం, ఇమ్యునైజేషన్ తగ్గుదలపై యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సిద్ధతపై కొత్తగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement