Putin: జెలెన్‌స్కీతో పుతిన్ భేటీ అసాధ్యం.. క్రెమ్లిన్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మియామిలో జరగనున్న జీ20 సదస్సు (G20)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ నేరుగా చర్చలు జరపనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలను రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కొట్టిపడేశారు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయన్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారమని పేర్కొన్నారు. ఇరువురి మధ్య నేరుగా చర్చలు జరగడం అసాధ్యమని స్పష్టం చేశారు.
వివరాలు
జెలెన్‌స్కీ మాస్కోకు రావాల్సిందే: పెస్కోవ్
ఒకవేళ జెలెన్‌స్కీ.. పుతిన్‌ను నేరుగా కలవాలనుకుంటే మాస్కోకు రావాలని పెస్కోవ్ పునరుద్ఘాటించారు.
రష్యాలో కాకుండా మరే ఇతర ప్రదేశంలోనూ పుతిన్-జెలెన్‌స్కీ చర్చలు నిర్వహించడానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
అమెరికా వేదికగా డిసెంబర్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరవుతారా లేదా అనే విషయంపైనా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
వివరాలు
పుతిన్‌తో చర్చలకు సిద్ధం: జెలెన్‌స్కీ
ఇదిలా ఉండగా.. జీ20 సదస్సు సమయంలో అమెరికా తనను, పుతిన్‌ను ఆహ్వానిస్తే రష్యా అధ్యక్షుడితో నేరుగా చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శనివారం జెలెన్‌స్కీ తెలిపారు.
యుద్ధం విషయంలో మాస్కో ఏమనుకుంటుందన్నదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం తాము రష్యా సేనలను మరింత బలంగా ఎదుర్కొంటున్నామని జెలెన్‌స్కీ అన్నారు.