Melania Trump: మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఒలెష్కీలో రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‌లోని ఒలెష్కీనగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఈ ఒప్పందం కుదరడంలో మధ్యవర్తిత్వం వహించడం విశేషం. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.అదే ఏడాది ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంతాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. ఒలెష్కీ నగరం ఈ ప్రాంతంలోనే ఉంది.యుద్ధం కారణంగా నగరంలో తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో,సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఒలెష్కీ పరిస్థితిపై మెలానియా ట్రంప్ ఇరు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమైనట్లు గతవారం వైట్‌హౌస్ ప్రకటించింది.
వివరాలు
మానవతా సహాయం అందించేందుకు సుగమమైన మార్గం
యుద్ధ పరిస్థితుల కారణంగా ఒలెష్కీ నుంచి అనేక మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం నగరంలో మిగిలిన వృద్ధులు, చిన్నారులు ఆహారం, తాగునీరు, మందులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మానవతా సహాయం అందించేందుకు మార్గం సుగమమైంది.
సహాయక బృందాలు నగరంలోకి ప్రవేశించి అవసరమైన వస్తువులను బాధితులకు అందించే అవకాశం ఏర్పడింది.
అలాగే, యుద్ధ ప్రాంతం నుంచి బయటపడాలనుకునే పౌరుల కోసం సురక్షిత మార్గాలను ఏర్పాటు చేశారు.
వారు ప్రయాణించే మార్గాల్లో ఉన్న మందుపాతరలను తొలగించే పనులు కూడా కొనసాగుతున్నాయి.
దీంతో ఒలెష్కీలో చిక్కుకుపోయిన పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు, అక్కడ ఉన్న వారికి అవసరమైన సహాయం అందించేందుకు అవకాశం ఏర్పడనుంది.