LOADING...
Mexican Navy plane: కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు మృతి
కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు మృతి

Mexican Navy plane: కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికో నౌకాదళానికి చెందిన ఒక విమానం ప్రమాదానికి గురైంది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం గాల్వేస్టోన్‌ కాజ్‌వే సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. వైద్య అవసరాల కోసం ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మెక్సికో నేవీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏడాది వయస్సున్న ఒక చిన్నారిని చికిత్స కోసం తరలిస్తుండగా ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. విమానంలో ఆ చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారు. అయితే, మృతుల్లో ఎవరు ఉన్నారన్న విషయాన్ని అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు.

వివరాలు 

ప్రమాదంపై దర్యాప్తు

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మెక్సికన్‌ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు బృందాలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన ప్రారంభించాయి. ఈ ఘటనపై గాల్వేస్టోన్‌ కౌంటీ ఫెరీఫ్‌ కార్యాలయం స్పందిస్తూ, డ్రోన్‌ యూనిట్‌తో పాటు రెస్క్యూ సిబ్బందిని సహాయక చర్యల కోసం పంపినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదానికి పొగమంచు కారణమైందా అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూలిన మెక్సికో నేవీ విమానం

Advertisement