LOADING...
Mexico: భారత్, చైనాపై మెక్సికో వాణిజ్య యుద్ధం.. 50 శాతం సుంకాలు పెంపు
భారత్, చైనాపై మెక్సికో వాణిజ్య యుద్ధం.. 50 శాతం సుంకాలు పెంపు

Mexico: భారత్, చైనాపై మెక్సికో వాణిజ్య యుద్ధం.. 50 శాతం సుంకాలు పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా బాటలోనే మెక్సికో వెళ్తోంది. ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయంతో ప్రపంచ దేశాలు వాణిజ్య పరంగా ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడగా, మిత్ర దేశాలు కూడా ప్రత్యర్థులుగా మారిన సందర్భం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మెక్సికో వెళ్తోంది. భారతదేశం, చైనా, దక్షిణ కొరియా నుంచి దిగుమతులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది 5 శాతం నుంచి 50 శాతం వరకు కొత్త సుంకాలు విధించే బిల్లుకు మెక్సికో సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కోసం 76 మంది అనుకూలంగా, 5 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా, 35 మంది గైర్హాజరయ్యారు. దీంతో దక్షిణాసియా దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించినట్లైంది.

వివరాలు 

వచ్చే ఏడాది నుంచే అమల్లోకి..

కొత్త సుంకాలు వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానున్నాయి. దుస్తులు, లోహాలు, ఆటోమొబైల్ విడిభాగాలు సహా అనేక ఉత్పత్తులపై వీటి ప్రభావం పడనుంది. ముఖ్యంగా చైనాలోని ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఉత్పత్తులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకప్పుడు ప్రపంచ దేశాల‌తో సత్సంబంధాలు కొనసాగించిన మెక్సికో, ఇప్పుడు వ్యతిరేక దిశలో చర్యలు చేపడుతోంది. ఈ సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం దాదాపు 2.8 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మెక్సికో ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కగట్టింది.

Advertisement