
Michael Randriani: మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా మైఖేల్ రణ్‌ద్రియానిరినా
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు ఆఫ్రికా ద్వీప దేశ మడగాస్కర్‌లో నూతన అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా బాధ్యతలు చేపట్టారు. మూడు రోజుల క్రితం మడగాస్కర్‌లో సైనిక తిరుగుబాటు చేసి, పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన, ఈ ప్రకటన అనంతరం అధికారికంగా అధ్యక్ష పదవి స్వీకరించారు. మడగాస్కర్‌లో పేదరికం, విద్యుత్ కోతలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలు కారణంగా యువత నిరసనలు చేపట్టినట్లు ఇప్పటికే తెలుసు. ఈ నిరసనల నేపథ్యంలో 'క్యాప్సాట్' మిలిటరీ యూనిట్ నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా తిరుగుబాటుకు మద్దతు తెలిపారు.
Details
దేశం వదిలిపారిపోయిన ఆండ్రీ రాజోలినా
ఇటీవల ఆయన సైనిక తిరుగుబాటు చేసి దేశ పరిపాలనను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. దాంతో, అప్పటివరకు దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆండ్రీ రాజోలినా ప్రాణ భయంతో దేశాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మడగాస్కర్‌లో కొత్త పాలన సుస్థిరతపై అంతర్జాతీయ వర్గాల్లో కూడా పరిశీలనలు జరుగుతున్నాయి.