LOADING...
Hunter Syndrome: జీన్ థెరపీతో అద్భుతం.. హంటర్ సిండ్రోమ్‌ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల ఒలివర్
జీన్ థెరపీతో అద్భుతం.. హంటర్ సిండ్రోమ్‌ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల ఒలివర్

Hunter Syndrome: జీన్ థెరపీతో అద్భుతం.. హంటర్ సిండ్రోమ్‌ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల ఒలివర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడేళ్ల చిన్నారి ఒలివర్ చూ ఆరోగ్యంలో వైద్యశాస్త్రానికే సవాల్‌గా నిలిచిన ఒక మెడికల్ మిరాకిల్ చోటుచేసుకుంది. ప్రమాదకరమైన హంటర్ సిండ్రోమ్ (Hunter Syndrome) లేదా పీఎస్ 2 (MPS-II) గా పిలిచే అరుదైన జన్యు వ్యాధి నుంచి అతను కోలుకుంటుండటం వైద్యులను, తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచింది. ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసింది జీన్ థెరపీ. మాంచెస్టర్ వైద్య బృందం ఈ విజయానికి ఆధారస్తంభం అయింది.

Details

హంటర్ సిండ్రోమ్ ఎందుకంత ప్రమాదకరం?

ఒలివర్ చూ ఈ జన్యు వ్యాధితో పుట్టాడు. ఈ వ్యాధి శరీరం, మేధస్సుకు తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం ఉంది. దీనిని వైద్యులు తరచూ చైల్డ్‌హుడ్ డిమెన్షియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధితో బాధపడే పిల్లల్లో: శారీరక ఎదుగుదల మందగిస్తుంది జ్ఞాపకశక్తి క్రమేపీ తగ్గిపోతుంది ముఖ్యమైన ఎంజైమ్‌ల ఉత్పత్తి జరగదు చాలా సందర్భాల్లో 20 ఏళ్లు నిండకముందే ప్రాణాలు కోల్పోతారు

Details

జీన్ థెరపీతో అద్భుతం!

హంటర్ సిండ్రోమ్‌కు కారణమైన లోపభూయిష్ట జన్యువును గుర్తించిన శాస్త్రవేత్తలు, అటువంటి పిల్లల శరీరంలో ఆరోగ్యకర కణాలు పనిచేయేలా జీన్ థెరపీని రూపొందించారు. ఇదే పద్ధతిలో మాంచెస్టర్ వైద్య బృందం ఒలివర్‌పై చికిత్స ప్రారంభించింది. ప్రొఫెసర్ సైమన్ జోన్స్ నాయకత్వంలో రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రత్యేక శస్త్రచికిత్స నిర్వహించారు. థెరపీ ద్వారా ఒలివర్ శరీరంలోని కణాలు అవసరమైన ఎంజైమ్‌లను మళ్లీ తయారుచేయడం మొదలుపెట్టాయి. ఏడాది తర్వాత కనిపించిన అద్భుత ఫలితాలు చికిత్స ప్రారంభమై ఏడాది నిండకముందే వైద్యులు ఆశ్చర్యకరమైన మార్పులను గమనించారు. ఒలివర్ శరీరం ఇప్పుడు సాధారణ చిన్నారి మాదిరిగానే ఎదుగుతోంది, అభివృద్ధి సాగుతోంది. ప్రపంచ వైద్యచరిత్రలో ఇదే మొదటిసారి హంటర్ సిండ్రోమ్‌పై జీన్ థెరపీ విజయవంతంగా పనిచేసిన సందర్భంగా గుర్తిస్తున్నారు.