Miss Universe: మిస్ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా: వేదికను వీడిన అందాల వనితలు
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ అధికారి,మెక్సికోకు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల ప్రతినిధి మధ్య జరిగిన మాటల తారుమారుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన మొత్తం ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారమవడంతో నెట్టింట్లో వేగంగా వైరల్‌గా మారింది. ఈ డ్రామాకు కారణం ఏమిటంటే.. మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక ఫోటో షూట్‌కి హాజరు కాలేదు. దీనిపై మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్ మరియు మిస్ యూనివర్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన నవాత్ ఆమె గైర్హాజరు విషయాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించే తీరులో ఫాతిమాను తక్కువ చేసి మాట్లాడడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.
వివరాలు
తొలుత నా మాట విని, తర్వాత వాదించండి
దాంతో ఆమె మాట్లాడుతూ.. ''మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి'' అని తీవ్రంగా స్పందించారు. ''తొలుత నా మాట విని, తర్వాత వాదించండి'' అంటూ నవాత్ బదులిచ్చారు. ''తొలుత నా మాట విని, తర్వాత వాదించండి'' అంటూ నవాత్ బదులిచ్చారు. ఈ మాటలు ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీశాయి. ఆగ్రహంతో ఫాతిమా మాత్రమే కాకుండా మరికొన్ని దేశాల పోటీదారులు కూడా వేదిక నుంచి నేరుగా వాకౌట్ చేశారు. బయటకు వచ్చిన ఆమె తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
వివరాలు
అధికారిక ప్రకటన విడుదల చేసిన మిస్ యూనివర్స్ ఆర్గనైజేష
మొత్తం సంఘటన లైవ్‌స్ట్రీమింగ్ కావడంతో నవాత్‌పై విమర్శలు గుప్పుమన్నాయి. చివరికి ఆయన ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటనపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందిస్తూ, పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ గౌరవం, భద్రత కల్పించడం తమ బాధ్యత అని తెలిపి, ఈ సంఘటనను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక జైపూర్‌లో ఆగస్టు 18న నిర్వహించిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' లో మణిక విశ్వకర్మ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుత యూనివర్స్ పోటీల్లో భారత తరఫున పోటీపడుతున్నారు. గత సంవత్సరం విశ్వసుందరి కిరీటాన్ని డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ అందుకున్నది.