LOADING...
Iran: బుషెహర్ అణు కేంద్రంపై క్షిపణి దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
బుషెహర్ అణు కేంద్రంపై క్షిపణి దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

Iran: బుషెహర్ అణు కేంద్రంపై క్షిపణి దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై క్షిపణి దాడి జరిగినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇదే తరహా నాలుగో ఘటనగా సంస్థ పేర్కొంది. ఈ దాడిలో క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఘటనలో ఆ ప్రాంతంలోని ఒక భవనం కూడా దెబ్బతిన్నట్లు వివరించింది. అయితే ఈ దాడి కారణంగా అణు కేంద్రంలో ఎలాంటి రేడియేషన్ లీకేజ్ సంభవించలేదని ఐఏఈఏ స్పష్టం చేసింది.

వివరాలు

సంయమనం పాటించాలి

ప్రస్తుతం ఇరాన్‌లో పనిచేస్తున్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం ఇదే కావడం విశేషం. ఈ ఘటనపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో ​​గ్రోస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభావిత భవనాల్లో కీలక పరికరాలు ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అణు కేంద్రాల పరిసర ప్రాంతాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు జరగకూడదని హెచ్చరించారు. అణు ప్రమాదాల ముప్పును నివారించేందుకు అన్ని పక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల్లో అణు భద్రత, రక్షణను కాపాడటం అత్యంత ప్రాధాన్య అంశమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement