Page Loader
PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకు హాజరైన మోదీ.. బుధవారానికి అమెరికా ప్రయాణం 
ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకు హాజరైన మోదీ.. బుధవారానికి అమెరికా ప్రయాణం

PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకు హాజరైన మోదీ.. బుధవారానికి అమెరికా ప్రయాణం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం దిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయనకు పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ప్రధాని మోడీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఈ ప్రత్యేక దృశ్యాలను మోదీ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, "తన స్నేహితుడు మాక్రాన్‌ను పారిస్‌లో కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏఐ శిఖరాగ్ర సమావేశానికి ముందు, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ పారిస్‌లో విందు ఏర్పాటు చేయగా, మోడీ అందులో హాజరయ్యారు.

Details

విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం

ఈ సందర్భంగా మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు పారిస్ విమానాశ్రయంలో భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున చేరుకుని "మోడీ.. మోడీ" , "భారత్ మాతాకీ జై" నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ, ట్విట్టర్ ద్వారా వారికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకను చిరస్మరణీయ స్వాగతంగా అభివర్ణించారు. ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకార్న్ కూడా మోడీకి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మంగళవారం పారిస్‌లో నిర్వహించనున్న ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, చైనా ఉప ప్రధాని జాంగ్ గువోగింగ్ సహా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు.

Details

రెండ్రోజుల పాటు యూఎస్ లో పర్యటన

ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనను బలోపేతం చేయడం, తద్వారా భవిష్యత్‌ సాంకేతిక అభివృద్ధికి దోహదపడే విధానాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అయ్యి, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. బుధవారం ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న అనంతరం మోడీ అమెరికా పయనమవుతారు. రెండు రోజుల పాటు యూఎస్‌లో పర్యటించి, అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యి ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు.