PM Modi: మనీలాలోని వందేళ్ల నాటి గురుద్వారాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మనీలాలోని ఖల్సా దివాన్ గురుద్వారాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 49వ ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లిన మోదీ.. తన పర్యటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Feeling very blessed to be at the Gurudwara Khalsa Diwan in Manila.
— Narendra Modi (@narendramodi) November 17, 2026
ਗੁਰਦੁਆਰਾ ਖ਼ਾਲਸਾ ਦੀਵਾਨ, ਮਨੀਲਾ ਵਿਖੇ ਆ ਕੇ ਬਹੁਤ ਵਡਭਾਗਾ ਮਹਿਸੂਸ ਕਰ ਰਿਹਾ ਹਾਂ। pic.twitter.com/JNuNFMq6Ja
వివరాలు
శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ
సిక్కుల పవిత్ర ప్రార్థనా మందిరమైన గురుద్వారాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మనీలాలోని ఖల్సా దివాన్ గురుద్వారం అక్కడి పురాతన ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ గురుద్వార పునరాభివృద్ధి పనులకు తాజాగా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాన్ని సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గురుద్వార పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వివరాలు
గురు సాహిబ్‌ల బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి: మోదీ
ఖల్సా దివాన్ గురుద్వారం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలకు వారధిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రార్థనా మందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు.
గురు సాహిబ్‌ల బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సిక్కు సమాజానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతరులకు సేవ చేయడంలో వారు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.
సమాజానికి సేవ చేస్తూ మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేస్తారని మోదీ తన ఎక్స్ పోస్టులో వెల్లడించారు.
కాగా, 23వ ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారమే ఫిలిప్పీన్స్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.