Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల.. తొలిసారి వినిపించిన స్వరం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ ఉనికిపై అనుమానాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తొలిసారిగా మొజ్తబా ఖమేనీ స్వరం కూడా వినిపించింది. యుద్ధం తర్వాత మరోసారి ఆయనకు సంబంధించిన తేదీ లేని వీడియో విడుదల కావడం ఆసక్తికరంగా మారింది. మొజ్తబా ఖమేనీ మతపరమైన విద్యా అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అరుదైన వీడియోను ఇరాన్ తొలిసారిగా విడుదల చేసింది. ఇందులో ఓ విద్యార్థి తన థీసిస్‌ను వివరిస్తుండగా మొజ్తబా ఖమేనీ శ్రద్ధగా వింటున్నట్లు కనిపించింది. అనంతరం ఆ పరిశోధనకు సంబంధించి తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు.
వివరాలు
దాడుల్లో తండ్రి మృతి.. మొజ్తబతా తీవ్ర గాయాలంటూ వార్తలు
ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ వీడియో బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సమన్వయంతో నిర్వహించిన దాడుల్లో మొజ్తబా ఖమేనీ తండ్రి ఖమేనీ మృతి చెందారు.
అదే దాడుల్లో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుత పరిస్థితిపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
తొలిసారి స్పష్టంగా వినిపించిన మొజ్తబా స్వరం
ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తాజాగా ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో మొజ్తబా ఖమేనీ గొంతు తొలిసారిగా వినిపించడం గమనార్హం.
ఇరాన్ పాలనా వ్యవస్థలో అమలులో ఉన్న 'ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్' గురించి ఆయన విద్యార్థులకు వివరిస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
వీడియోకు తేదీ లేకపోవడంతో ఇది ప్రస్తుత పరిస్థితికి సంబంధించినదేనా, లేక గతంలో చిత్రీకరించినదా అనే అంశంపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొజ్తబా వీడియో విడుదల
First Look
— Dr Tariq Tramboo (@tariqtramboo) August 24, 2026
Iran’s Supreme Leader Mojtaba Khamenei appears in newly released footage for the first time.
A rare public glimpse into Iran’s new leadership. pic.twitter.com/qaMDZ25BLI