LOADING...
US Flights: అమెరికాలో షట్‌డౌన్‌ ప్రభావం.. 8000 విమానాలు ఆలస్యం..!
అమెరికాలో షట్‌డౌన్‌ ప్రభావం.. 8000 విమానాలు ఆలస్యం..!

US Flights: అమెరికాలో షట్‌డౌన్‌ ప్రభావం.. 8000 విమానాలు ఆలస్యం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావం విమాన రవాణాపై తీవ్రంగా పడింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 8 వేలకు పైగా విమాన సర్వీసులు (US Flight Delays) అంతరాయం ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ షట్‌డౌన్‌ (US Shutdown) కారణంగా అనేక ప్రాంతాల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది విధులకు హాజరుకాలేకపోవడంతో, వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలోని 22 ప్రాంతాల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది కొరత ఏర్పడిందని అమెరికా రవాణా మంత్రి షాన్‌ డఫీ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ సిబ్బంది కొరత మరింతగా పెరగవచ్చని ఆయన హెచ్చరించారు. దాంతో విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు.

వివరాలు 

ఆలస్యంగా నడుస్తుున్న 2 వేల విమానాలు

అమెరికా సమయానుసారం ఆదివారం రాత్రి 11 గంటల వరకు సుమారు 8 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్‌ అవేర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ 45 శాతం సర్వీసులు.. అంటే దాదాపు 2 వేల విమానాలు.. ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 1,200, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 739, డెల్టా ఎయిర్‌లైన్స్‌ 600 సర్వీసులు కూడా అంతరాయం ఎదుర్కొన్నాయి.