Black rain in Moscow: మాస్కోలో బ్లాక్ రెయిన్.. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత భయానక పరిస్థితులు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా రాజధాని మాస్కోలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడుల అనంతరం నల్లటి వర్షం కురిసిన ఘటన కలకలం రేపుతోంది. మాస్కోతో పాటు పరిసర ప్రాంతాల్లో చమురు రిఫైనరీలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ ఎత్తున డ్రోన్ దాడులు నిర్వహించిన కొద్ది గంటల్లోనే ఈ విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వందల సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి దాడి చేయడంతో ఆకాశం మొత్తం నల్లటి పొగతో కప్పుకుపోయిందని,అనంతరం బూడిద కలిసిన నల్లటి వర్షం కురిసిందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ వర్షం సాధారణ వర్షం కాకుండా కాలుష్య కణాలు,బూడిద మిశ్రమంతో కూడుకున్నదిగా స్థానికులు చెబుతున్నారు. నల్లటి వర్షం కారణంగా ప్రజలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
వివరాలు
భవనాలు, రహదారులు, వాహనాలపై నల్లటి మురికి నీరు
ముఖ్యంగా తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వెల్లడించారు. అంతేకాకుండా భవనాలు, రహదారులు, వాహనాలపై నల్లటి మురికి నీరు పేరుకుపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైమానిక దాడుల అనంతరం కురిసే ఇలాంటి వర్షాలు ప్రమాదకరమని స్థానిక వాతావరణ అధికారులు హెచ్చరించారు. గాలిలోకి ఎగసిన కాలుష్య కణాలు, బూడిద వర్షపు నీటితో కలిసి నేలపై పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో మాస్కో అధికారులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు.
వివరాలు
ఉక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి
నల్లటి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు,వృద్ధులు,ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారుల వివరాల ప్రకారం, గురువారం ఉక్రెయిన్ రష్యాపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఒకదాన్ని నిర్వహించింది. ఈ దాడుల ప్రభావంతో మాస్కోలోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చినట్లు తెలిపారు. దీంతో 500కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రోన్ దాడుల ప్రభావం, అనంతరం కురిసిన నల్లటి వర్షం కారణంగా మాస్కోలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తుండగా, ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డ్రోన్ దాడుల తర్వాత నల్లటి బూడిద వర్షం
Night fell earlier than usual in Moscow this evening—the black clouds of smoke that covered the sky following the Ukrainian strike on the oil refineries. pic.twitter.com/M2OvzZDetW
— Gameover 🇦🇺🇮🇱 (@MarkoS2075) June 18, 2026
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాహనాలపై నల్లటి మురికి
Black, oil-like residue is falling over Moscow and surrounding areas, leaving stains and marks on cars, windowsills, benches, and other surfaces. pic.twitter.com/wOmCJ83QRf
— Abhijeet Sanatani 🚩 (@theherculesguy) June 18, 2026