Russia: పాకిస్థానీ మీడియా మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక 'ది ఫ్రాంటియర్ పోస్టు (The Frontier Post)' మాస్కోకు వ్యతిరేకంగా కావాలని కథనాలు ప్రచురిస్తోంది అంటూ రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని రష్యా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'పాకిస్థాన్‌లో ఆంగ్లంలో వచ్చే ది ఫ్రాంటియర్ పోస్టు పత్రికలో రష్యా వ్యతిరేక కథనాలు పెరిగిపోతున్నాయని మేం గమనించాము. అయితే, ఈ పత్రిక ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ లో ఉండటంతో దీన్ని పూర్తిగా పాకిస్థానీ పత్రికగా పరిగణించలేం. దీనిలోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు నిరంతరం రష్యా విదేశాంగ విధానాలు, నాయకత్వం పై నెగటివ్ దృక్కోణంతో రూపొందుతున్నాయి' అని రాసింది.
వివరాలు
2024లో రష్యా జీడీపీ 4.1%వృద్ధి
అంతేకాక,ఆ పత్రికలో కథనాలు ఎంపిక చేసే వ్యవహారం అమెరికన్ భావజాలం అనుసరించే టీమ్ చేతుల్లో ఉందని,వారు రష్యా విదేశాంగవిధానాన్ని విమర్శించే వర్గాలకు,అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఆక్షేపణలు చేసే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించింది. రష్యాకు అనుకూలంగా కనిపించే ఒక్కకథనాన్నీఆ పత్రిక ప్రచురించలేదని,ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ సంబంధిత వార్తలకు ఎక్కువ స్థానం ఇస్తూ,మాస్కో ఫార్మాట్ ఆఫ్ కన్సల్టేషన్స్ వంటి అంశాలను పూర్తిగా పక్కనపెడుతున్నదనేది గమనార్హమని రష్యా తెలిపింది. అదేసందర్భంలో,అమెరికాకు చెందిన ఈ పత్రిక జర్నలిస్టులు రష్యాను ఆర్థికంగా కుప్పకూలుతున్న, బలహీనమైన దేశంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని రష్యా విమర్శించింది. తమ దేశ ఆర్థికవ్యవస్థ బయటి ఒత్తిళ్ల మద్య కూడా స్థిరంగా ఎదుగుతున్నదని తెలిపింది.2024లో రష్యా జీడీపీ 4.1%వృద్ధి సాధించిందని రష్యా అధికారులు స్పష్టం చేశారు.