LOADING...
Pakistan: మునీర్‌కు సైన్యంలో అపరిమిత అధికారాలు.. పాక్‌లో నిరసనలు
మునీర్‌కు సైన్యంలో అపరిమిత అధికారాలు.. పాక్‌లో నిరసనలు

Pakistan: మునీర్‌కు సైన్యంలో అపరిమిత అధికారాలు.. పాక్‌లో నిరసనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో సైనిక చీఫ్ అపరిమిత అధికారాల కోసం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుకు రావడంతో, దేశంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసవరణ ద్వారా ఆర్టికల్ 243లో మార్పులు చేసుకుని, సైన్యంలోని అత్యున్నత స్థానాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న 'చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్' పదవిని తొలగించి, 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్'(CDF)స్థాపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్, తెహ్రీకే తౌఫిజ్ ఆ ఇన్స్టిట్యూషన్‌లను కలిపి దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ చర్యతో పాకిస్తాన్ రాజ్యాంగానికి పునాది దెబ్బతినబోతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలతో సంబంధిత విధానాలు కుంగిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Details

సైన్యంలో ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం

టీటీఏపీ నేత ఆలమ్ రజా నసీర్ అబ్బాస్, 27వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కదలికలు జరగాలని కోరారు. పష్తూన్‌ ఖవా మిల్లీ అవామీ పార్టీ నేత మహమూద్ ఖాన్, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కోసం నిరసనలు చేయడం మాత్రమే మార్గమని స్పష్టం చేశారు. ఇక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఆర్టికల్ 243లో మార్పులు సుప్రీం కోర్టు అధికారం వంటి ప్రభావాన్ని కలిగి ఉండవచ్చని, కొత్త CDF పదవి సృష్టించడం వల్ల సైనిక దళాల్లో సమతుల్యతకు కూడా తగిన ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థల భవిష్యత్తు, సైన్య నిర్మాణంలో సంతులనం వంటి అంశాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు.