Loading...
Elon Musk: యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ.. మస్క్ వ్యంగ్యాస్త్రాలు
యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ.. మస్క్ వ్యంగ్యాస్త్రాలు

Elon Musk: యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ.. మస్క్ వ్యంగ్యాస్త్రాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘనవిజయం సాధించడంపై టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యంగ్యంగా స్పందించారు. రిపబ్లికన్ పార్టీకి వందల మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లోచురకలు అంటించారు. "ఎన్నికల్లో జోక్యం చేసుకునే నా స్పేస్ లేజర్లు విఫలమయ్యాయి"అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. "ప్రస్తుతం అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది" అని మరో పోస్టులో పేర్కొన్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు అద్భుతమైన ఫలితాలు సాధించారు. యూఎస్ నెట్‌వర్క్‌ల అంచనాల ప్రకారం..సెనెట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ డెమొక్రాట్లు తిరిగి పట్టు సాధించారు. ఈ పరిణామం వాషింగ్టన్‌లో అధికార సమతుల్యతలో కీలక మార్పునకు సంకేతంగా నిలిచింది.

వివరాలు 

మస్క్, ట్రంప్‌ విధానాలపై టెక్సాస్ నూతన సెనెటర్ జేమ్స్ టలారికో విమర్శలు

ముఖ్యంగా సంప్రదాయంగా రిపబ్లికన్లకు బలమైన ప్రాంతంగా ఉన్న టెక్సాస్‌లోనూ డెమొక్రాట్లు విజయం సాధించడం ఈ ఎన్నికల్లో ప్రధాన పరిణామంగా మారింది.

ఈ నేపథ్యంలో టెక్సాస్ నుంచి సెనెటర్‌గా ఎన్నికైన జేమ్స్ టలారికో.. మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

తన విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. "300 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ప్రచారాన్ని ఎదుర్కొన్నాం. సోషల్ మీడియా అల్గారిథమ్‌లను నియంత్రించే బిలియనీర్లకు వ్యతిరేకంగా పోరాడాం" అని మస్క్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ట్రంప్ పాలనలో రాజకీయాలు ఒక క్రీడగా, ట్రోలింగ్‌గా మారిపోయాయని ఆరోపించారు.

వివరాలు 

డెమొక్రాట్ల గెలుపుతో టెక్నాలజీ రంగం భవిష్యత్తుపై పెరిగిన ఆందోళన

ఈ ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీకి మస్క్ అతిపెద్ద ఆర్థిక మద్దతుదారుల్లో ఒకరిగా నిలిచారు.

ఎన్బీసీ న్యూస్ కథనం ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ ప్రచారాల కోసం ఆయన సుమారు 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.

ఇంత భారీ మొత్తంలో నిధులు వెచ్చించినప్పటికీ రిపబ్లికన్లకు పరాజయం తప్పలేదు.

డెమొక్రాట్ల విజయం టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల భవిష్యత్తుపై కొత్త ఆందోళనలకు దారితీస్తోంది.

ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్ ఫ్యూచర్లు పడిపోయాయి. టెక్నాలజీ, డేటా సెంటర్ రంగాలపై డెమొక్రాట్ల విధానాలు ఎలా ఉండబోతున్నాయన్న సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌పై పూర్తి పట్టు సాధించిన డెమొక్రాట్లు.. ట్రంప్ శాసనపరమైన అజెండాను సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT