Elon Musk: గూగుల్ సహ వ్యవస్థాపకుడితో స్నేహం ఎందుకు తెగిపోయిందో చెప్పిన మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారు.
2016లో ఫార్చూన్ సంస్థ విడుదల చేసిన బీఎఫ్‌ఎఫ్ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫారెవర్) జాబితాలో ఈ ఇద్దరూ చోటు దక్కించుకున్నారు.
అయితే ఇప్పుడు వీరి మధ్య మాటలు లేవు. ఈ విషయం గురించి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మస్క్ వెల్లడించారు.
కృత్రిమ మేధ అంశంపై అభిప్రాయ భేదాలే తమ మధ్య విభేదాలకు కారణమయ్యాయని తెలిపారు.
Details
ఏఐ భద్రతపై అభిప్రాయ భేదాలు
కృత్రిమ మేధపై తనకు, లారీ పేజ్‌కు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.
గూగుల్‌లో పనిచేసే ఏఐ నిపుణుడు ఇల్యా సట్‌స్కీవర్‌ను ఓపెన్‌ఏఐలోకి తీసుకురావడం లారీకి ఆగ్రహానికి కారణమైంది.
అయితే తన నిర్ణయాన్ని సమర్థించుకున్న ఆయన, ఏఐ భద్రతను గూగుల్ తక్కువగా అంచనా వేస్తోందని, అందుకే తాను ఆ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు.
Details
ఓపెన్‌ఏఐ నుంచి మస్క్ వైదొలగడం
2015లో మస్క్, శామ్ ఆల్ట్‌మన్ కలిసి చాట్‌బాట్ సేవలు అందించే ఓపెన్‌ఏఐను స్థాపించారు. అయితే, 2018లో మస్క్ సంస్థ నుంచి వైదొలిగారు.
అప్పట్లో టెస్లా తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఏఐను అభివృద్ధి చేస్తుండడంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా సంస్థను వీడుతున్నానని చెప్పారు.
అయితే ఆల్ట్‌మన్ మరో వాదన వినిపించారు.
మస్క్ ఓపెన్‌ఏఐను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చూశారని, కానీ బోర్డు సభ్యులు దీన్ని అంగీకరించకపోవడంతో ఆయన వెళ్లిపోయారని తెలిపారు.
ఈ ఘటనల కారణంగా మస్క్, లారీ పేజ్ మధ్య గల స్నేహం విడిపోయిందని, ప్రస్తుతం ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించుకోవడం లేదని మస్క్ స్పష్టం చేశారు.