Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. 469కి చేరిన మృతులు.. 1,550 మంది గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 469కి చేరింది. మరోవైపు దాదాపు 1,550 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. భారతీయులే అధికం.. నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. వరదల్లో 178 మంది భారతీయులు గల్లంతయ్యారు. వరదల్లో ఆచూకీ లభించకుండా పోయిన విదేశీయుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికంగా ఉందని బోర్డు తెలిపింది. దీంతో నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాలు
నేపాల్‌కు చైనా హెచ్చరిక..
ఇదిలా ఉండగా.. నేపాల్‌కు చైనా కీలక హెచ్చరిక జారీ చేసింది.
చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్.. నేపాల్‌కు లెవెల్-4 హెచ్చరికలు జారీ చేసింది.
టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో రానున్న రోజుల్లో మరిన్ని వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని చైనా అధికారులు తెలిపారు.
ఈ కొండచరియలు చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల సంగమ ప్రాంతంలో అడ్డుగా పేరుకుపోయినట్లు వెల్లడించారు.
వివరాలు
కృత్రిమ సరస్సుగా మారిన ప్రాంతం..
కొండచరియలు నదుల ప్రవాహానికి అడ్డుగా నిలవడంతో అక్కడ కృత్రిమ సరస్సు ఏర్పడినట్లు చైనా తెలిపింది.
ఈ సరస్సులో ఇప్పటికే దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరిందని పేర్కొంది.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తాత్కాలిక డ్యామ్‌కు ప్రమాదం..
నీటి మట్టం ఇదే విధంగా పెరిగితే.. రానున్న 72 గంటల్లో కొండచరియలతో ఏర్పడిన తాత్కాలిక అడ్డంకి లేదా డ్యామ్ బద్దలయ్యే అవకాశం ఉందని చైనా హెచ్చరించింది.
అదే జరిగితే దిగువ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీగా నీరు ప్రవహించే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.