Page Loader
యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం 
యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం

యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం 

వ్రాసిన వారు Stalin
Aug 28, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వినామయాన సంస్థలు చెప్పాయి. దీంతో దేశంలో విమాన సర్వీసులు ఆలస్యమవుతాయని స్పష్ట చేశాయి. ఇంజినీర్లు లోపాన్ని కనుగొని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని, దీని వలన కలిగే అసౌకర్యానికి తాము క్షమాపణలు కోరుతున్నట్లు ఆయా సంస్థ పేర్కొన్నాయి. అయితే సాంకేతిక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. సాంకేతిక సమస్య నేపథ్యంలో స్కాటిష్ విమానయాన సంస్థ లోగనైర్, ఈజీజెట్ విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రయాణికుల ట్విట్టర్ వేదికగా హెచ్చరించాయి.

విమానం

కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం: ఈజీజెట్ 

ప్రస్తుతానికి యూకేలో విమానాల రాకపోకల విషయంలో ల్యాండింగ్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కానీ టేకాఫ్‌కు అనుమతి లేదు. సుధీర్ఘ వారంతపు సెలవులకు విదేశాలకు వెళ్లిన వారు ఎక్కువ సంఖ్యలో తిరిగి వస్తున్న సమయంలో విమాన సర్వీసులు ఆగిపోవడం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతారని ట్రావెల్ జర్నలిస్ట్ సైమన్ కాల్డర్ అన్నారు. ఇది ఎప్పుడు పరిష్కరించబడుతుందో కచ్చితంగా తెలియదన్నారు. సమస్యకు కారణాన్ని కూడా అధికారులు గుర్తించలేదని పేర్కొన్నారు. సమస్య ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి తాము సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నామని ఈజీజెట్ ఎయిర్ లైన్ తెలిపింది.