Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్....అభ్యంతరం తెలిపిన భారత్
నేపాల్ దేశం విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోంది. తాజాగా మూడు కొత్త భూభాగాలతో కూడిన వంద రూపాయల నోటును ఆ దేశం పునర్ముద్రించనున్నట్లు ప్రకటించింది. వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలతో కొత్త పటాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ మీడియాకు తెలిపారు. నేపాల్ పునర్ముద్రించనున్న కొత్త వంద రూపాయల నోటుపై ఉన్న భూభాగాలు భారత్ కు చెందినవి. నేపాల్ చర్య పట్ల ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిని కృత్రిమ విస్తరణగా అభివర్ణించింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లతో నేపాల్‌తో 1850 కి.మీ.సరిహద్దును పంచుకుంటోంది.