LOADING...
New US work permit rules: USCIS సవరణ కింద తక్కువ నిబంధనలు, కఠినమైన తనిఖీలు
సవరణ కింద తక్కువ నిబంధనలు, కఠినమైన తనిఖీలు

New US work permit rules: USCIS సవరణ కింద తక్కువ నిబంధనలు, కఠినమైన తనిఖీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. శరణార్థుల‌కు ఇచ్చే వర్క్ పర్మిట్‌ల కాల పరిమితిని తగ్గిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్‌ అండ్ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) అధికారికంగా ప్రకటించింది. శరణార్థులు, ఆశ్రయం కోరుతున్న వారు, అలాగే గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (EAD) ద్వారా అనుమతులు పొందుతారు. ఇప్పటివరకు ఈ వర్క్ పర్మిట్‌లకు ఐదేళ్ల చెల్లుబాటు ఉండేది. అయితే తాజా మార్పుల ప్రకారం ఆ గడువు ఇప్పుడు కేవలం 18 నెలలకే పరిమితం చేశారు. దేశ భద్రత కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ స్పష్టంచేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వర్క్‌ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం..!

Advertisement