LOADING...
Los Angeles: లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

Los Angeles: లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజెల్స్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వీసాలు, పాస్‌పోర్ట్‌లు, OCI దరఖాస్తులు వంటి కాన్సులర్ సేవల కోసం ఇకపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 15, 2025 నుండి, లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభమైంది అని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. ఈ కేంద్రాన్ని VFS గ్లోబల్ నిర్వహిస్తుంది. దీని వల్ల దక్షిణ కాలిఫోర్నియా, ఆస్పా ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది భారతీయులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. కొత్త కేంద్రం డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్, 800 S ఫిగ్యురోవా స్ట్రీట్, సూట్ 1210, CA 90017 వద్ద ఏర్పాటు చేశారు.

వివరాలు 

సెంటర్ ద్వారా అందించే సేవలు: 

ఇది సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. అదనంగా, దరఖాస్తుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచి, శనివారాల రోజుల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది ప్రత్యేకంగా పని చేయే ప్రజలకు, అలాగే విద్యార్థులు, వ్యాపారుల వంటి సమయపరిమితులు ఉన్నవారికి గొప్ప ఉపశమనం. పాస్‌పోర్ట్ అప్లికేషన్లు, రీన్యూవల్ వీసా సేవలు OCI (ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డు దరఖాస్తులు, రీ-ఇష్యూ, ఇతర మిస్సెలేనియస్ సేవలు ఇండియన్ సిటిజన్‌షిప్ రీనాన్సియేషన్ (సరెండర్ సర్టిఫికేట్) గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (GEP) అటెస్టేషన్,ఇతర కాన్సులర్ సంబంధిత సేవలు

వివరాలు 

భారతీయులకు ఇది వన్-స్టాప్ పరిష్కారం

ఈ కేంద్రం ద్వారా, ఇకపై అమెరికాలోని భారతీయులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే సులభంగా అన్ని ప్రధాన సేవలను పొందవచ్చు. CGI ప్రకారం, ఇది సమయం, ఖర్చు ఆదా చేస్తూ, ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది. లాస్ ఏంజెల్స్,చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులకు ఇది వన్-స్టాప్ పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ ఈ చొరవ USలోని భారతీయుల కోసం ఒక ముఖ్యమైన సౌకర్యంగా నిలుస్తుంది. మరిన్ని వివరాల కోసం,VFS గ్లోబల్ వెబ్‌సైట్ visa.vfsglobal.com/usa/en/ind లేదా లాస్ ఏంజెల్స్ ఇండియా కాన్సులేట్ అధికారిక సైట్ను సందర్శించవచ్చు.

Advertisement