Barry Sternlicht: న్యూయార్క్ ముంబైలా మారిపోతుందా? మమ్దానీపై బిలియనీర్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
రియల్ ఎస్టేట్ బిలియనీర్ బ్యారీ స్టెర్న్‌లిచ్ట్ న్యూయార్క్ నగర భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ నేతృత్వంలో నగరానికి "చాలా కఠిన సమయం" ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. స్టార్‌వుడ్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ అయిన స్టెర్న్‌లిచ్ట్, సిఎన్‌బిసి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నగరంలోని ట్రేడ్ యూనియన్లు అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు పెరగడానికి ప్రధాన కారణమని అన్నారు. ఈ సమస్యలు మమ్దానీ పాలనలో మరింత తీవ్రమవుతాయని ఆయన భావిస్తున్నారు.
క్లిష్టమైన విధానం
"ఇలా పోతే న్యూయార్క్ ముంబైలా మారిపోతుంది":స్టెర్న్‌లిచ్ట్
స్టెర్న్‌లిచ్ట్ మాట్లాడుతూ.. "ఎడమచేతివాదులు కొన్నిసార్లు అతివాద ధోరణి ప్రదర్శిస్తారు. వారు 'టెనెంట్లు రెంట్ చెల్లించనవసరం లేదు' అంటారు. కానీ వారు చెల్లించకపోతే బయటకు పంపలేరు. అలా పొరుగువాడు చెల్లించకపోతే, మరొకరు కూడా చెల్లించరు. చివరికి న్యూయార్క్ నగరం ముంబైలా మారిపోతుంది" అని అన్నారు. మమ్దానీ 'డిఫండ్ ది పోలీస్' అన్న విధానానికి మద్దతు తెలిపిన వ్యక్తి కావడంతో, భద్రతా పరిస్థితులు కూడా దెబ్బతినే అవకాశముందని స్టెర్న్‌లిచ్ట్ హెచ్చరించారు.
పునరావాస ప్రణాళికలు
మాన్హాటన్ నుండి కార్యాలయం తరలింపు ఆలోచనలో స్టార్‌వుడ్
స్టెర్న్‌లిచ్ట్ కంపెనీ ప్రస్తుతం మాన్హాటన్ మధ్యభాగంలో ఉన్న కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చే ఆలోచనలో ఉంది. "మమ్దానీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటాడా అనేది సందేహం. ప్రపంచంలో ఎక్కడా సోషలిజం సక్సెస్ కాలేదని, కానీ ఆయనపై ఓటు వేసిన ప్రజలు దీన్ని ఇప్పుడే గ్రహించలేకపోతున్నారు" అని ఆయన విమర్శించారు.
ప్రచార వాగ్దానాలు
మమ్దానీ వాగ్దానాలు: రెంటు ఫ్రీజ్, ఉచిత బస్సులు, చైల్డ్‌కేర్
ఇక మమ్దానీ వాగ్దానాలు చూస్తే, ఆయన రెంట్-స్టెబిలైజ్డ్ అపార్ట్‌మెంట్‌లలో రెంటు ఫ్రీజ్ చేయడం, ఉచిత బస్ సర్వీసులు అందించడం, యూనివర్సల్ చైల్డ్‌కేర్ ప్రోగ్రామ్ ప్రారంభించడం, ప్రభుత్వ ఆధీనంలోని గ్రోసరీ స్టోర్లు ప్రారంభించడం వంటి పథకాలు ప్రకటించారు. అయితే స్టెర్న్‌లిచ్ట్ అభిప్రాయం ప్రకారం, ఈ వాగ్దానాలు ప్రభుత్వ సబ్సిడీలు,యూనియన్ సహకారం లేకుండా అమలు కావడం కష్టం. "యూనియన్లు తమ వర్క్ లాజ్, వేతనాలు మొదలైన వాటిలో కొంచెం సడలింపు ఇవ్వాలి. లేదంటే ఆర్థికంగా కొత్త గృహ నిర్మాణం సాధ్యంకాదు" అని ఆయన స్పష్టం చేశారు.