Page Loader
న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం 
న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం

న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం 

వ్రాసిన వారు Stalin
May 31, 2023
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలో ఎక్కువగా జనావాసాలు లేని ఆక్లాండ్ దీవులకు సమీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే బుధవారం నివేదించింది. న్యూజిలాండ్‌కు చెందిన జియోనెట్ మానిటరింగ్ ఏజెన్సీ ప్రకారం భూకంప కేంద్రం భూ ఉపరితలానికి 33 కిలోమీటర్ల (21 మైళ్లు) దిగువన ఉంది. సునామీ హెచ్చరికలు లేవని జియోనెట్ మానిటరింగ్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఎంత నష్టం జరిగిందనేది ఇంకా వెల్లడించలేదు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇన్వర్‌కార్గిల్‌కు చెందిన ఒక అధికారి మాత్రం వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యూజిలాండ్‌‌ దక్షిణ తీరంలో భూకంపం