LOADING...
New Zealand: న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు 
న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

New Zealand: న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఉత్సాహంగా మొదలయ్యాయి. క్యాలెండర్ మారుతున్న వేళ.. కిరిబాటి దీవుల తర్వాత 2026 సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన నగరం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్. అక్కడి స్థానిక సమయం ప్రకారం గడియారం ముల్లు 12 దాటగానే.. ఆక్లాండ్ నడిబొడ్డున ఉన్న న్యూజిలాండ్ ఎత్తైన కట్టడం 'స్కై టవర్' బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది. దాదాపు ఐదు నిమిషాల పాటు కొనసాగిన ఈ అద్భుత దృశ్యంలో, స్కై టవర్ వివిధ అంతస్తుల నుంచి 3,500కు పైగా రకాల బాణసంచా కాల్చారు. అయితే వాతావరణ పరిస్థితులు వేడుకలకు కొంత అడ్డంకిగా మారాయి. భారీ వర్షాలు, ఉరుముల హెచ్చరికల నేపథ్యంలో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లోని కొన్ని చిన్న కమ్యూనిటీ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు.

వివరాలు 

 ఎక్కడ చూసినా లెక్కలేనన్ని పీతలే.. 

అయినప్పటికీ,ప్రధాన న్యూఇయర్ వేడుకలు మాత్రం వర్షాన్ని లెక్కచేయకుండా ఘనంగా కొనసాగాయి. ఆక్లాండ్‌కు ముందే, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మారుమూల దేశం కిరిబాటిలోని కిరితిమతి అటోల్ ప్రపంచంలోనే మొదటిగా 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అక్కడి అనుభూతిని ఓ పర్యాటకుడు వివరిస్తూ... "చుట్టూ శాటిలైట్లు లేవు, మనుషుల కదలికలు కనిపించవు, నిశ్శబ్దమైన చీకటి వాతావరణం, ఎక్కడ చూసినా లెక్కలేనన్ని పీతలే కనిపించాయి" అంటూ ప్రకృతి మధ్యలో నూతన సంవత్సరాన్ని జరుపుకున్నట్లు తెలిపారు.

వివరాలు 

చాతం ఐలాండ్‌లో కొత్త ఏడాది సంబరాలు

ఇక కేవలం 600 మంది మాత్రమే నివసించే న్యూజిలాండ్ చాతం ఐలాండ్‌లో కూడా కొత్త ఏడాది సంబరాలు జరిగాయి. తెల్లవారే వరకు తమ బృందం వేడుకలు కొనసాగిస్తుందని అక్కడి ఓ హోటల్ యజమాని వెల్లడించారు. ఈ విధంగా ప్రపంచంలో తూర్పు దేశాల నుంచి పడమర దిశగా 2026 నూతన సంవత్సరం క్రమంగా విస్తరిస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వర్షం కురుస్తున్నా స్కై టవర్ నుంచి బాణసంచా కాల్పులు 

Advertisement